Home  »  TV News  »  Podharillu :  శైలు ప్రేమను గుర్తించని కేశవ.. మహా మనసు గెలుచుకునేందుకు చక్రి పాట్లు!

Updated : Jun 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -145 లో.....కేశవ డల్ గా ఉంటే తన దగ్గరికి మాధవ వస్తాడు. ఏమైంది రా అని అడుగుతాడు. మళ్ళీ మన ఇల్లు చీకటి అయింది. తను వెళ్ళిపోయింది కదా అని కేశవ అంటాడు. చక్రి వల్లే ఇదంతా వాడు లవ్ చేసాడు‌‌.. ఆశలు పెంచుకున్నాడు నిజాయితీ గానే ఉన్నాడు కానీ ఆ నిజాయితీ తనకి తెలిసేలా చెయ్యలేదు.. మనల్ని ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోకూడదు.. చేసుకుంటే ఎప్పుడు వెలితిగానే ఉంటుందని కేశవతో మాధవ చెప్పగానే అతనికి శైలు గుర్తుకువస్తుంది.

ఆ తర్వాత పెళ్లిచూపులు ఏమైందని కనుక్కోవడానికి శైలు ఇంటి దగ్గరికి కేశవ వెళ్తాడు. అక్కడ బండి ఆగిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడు. మరొకవైపు శైలు కూడా తనని చూస్తుంది. చెత్త వెయ్యడానికి వెళ్తున్నట్లు యాక్టింగ్ చేసి నువ్వేంటి ఇక్కడ అని కేశవని శైలు అడుగుతుంది. అవును పెళ్లిచూపులు ఏమయ్యాయి.. అబ్బాయి బాగున్నాడా అని కేశవ అడుగుతాడు‌. బాగున్నాడని శైలు చెప్తుంది. అయినా కేశవ బయటపడకపోవడంతో నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా ప్రేమిస్తున్నానని చెప్పమని శైలు అంటుంటే కేశవకి ఏం అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మహాకి చక్రి సారీ అంటూ బెలూన్ లపై రాసి కిటికీ దగ్గరికి పంపిస్తాడు. అది చూసి కిందకి వచ్చి తనపై కోప్పడుతుంది మహా. ఆ తర్వాత  చక్రి ఇంటికి వస్తాడు‌. తను ఏం చేసిన క్షమించడం లేదని కేశవకి చెప్తూ చక్రి బాధపడుతాడు. మనం ప్రేమిస్తున్నట్లు‌‌.. మనకి ఎలా తెలుస్తుందిరా అని కేశవ అడుగుతాడు. మహా పరిచయం దగ్గర నుంచి చక్రి అన్ని సందర్భాలు చెప్తాడు. దాంతో శైలు, కేశవ కలిసిన సందర్భాలు కేశవ ఉహించుకుంటాడు. ఆ తర్వాత మహాకి తన హాస్టల్ వాళ్ళందరు మాట్లాడతారు‌. అతను అంతలా సారీ చెప్తున్నాడు క్షమించవచ్చు కదా అని అంటారు. దాంతో మహా వాళ్ళపై కోప్పడుతుంది. ఆ తర్వాత కన్నాకి ఫీవర్ వస్తుంది. నేను వాడిని చూసుకుంటా.. నువ్వు వెళ్ళు అన్నయ్య అని మాధవతో అంటాడు. ఒరేయ్ మీ వదినపై బెంగతో జ్వరం వచ్చింది కదా ఒకసారి తనని రమ్మనొచ్చు కదా.. కనీసం వీడియో కాల్ అయినా చెయ్యొచ్చు కదా అని కన్నాతో చక్రి అంటాడు. చేయనని కన్నా అంటాడు.

ఆ తర్వాత కేశవ దగ్గరికి బంటి వస్తాడు. ఒరేయ్ ఆ ముంగీస నన్ను ప్రేమిస్తుందటరా అని కేశవ చెప్తాడు కానీ నేను ప్రేమిస్తున్నానో లేదో నాకు తెలియదని కేశవ అంటాడు. అన్న ఇప్పుడు ఆ శైలు కాలేజీకీ ఇలాగే వెళ్తుంది.. నీకు తన వంక చూడాలనిపిస్తే లవ్ చేస్తున్నట్లని బంటి సలహా ఇస్తాడు. మరొకవైపు మహాకి మాధవ ఫోన్ చేసి ఎలా ఉన్నావని మంచి చెడు కనుక్కుంటాడు. ఆ తర్వాత ఓంకారేశ్వర్ దగ్గరికి చక్రి వెళ్తాడు. నేను ఇచ్చిన ఐడియా బాగుందా అని అడుగుతాడు. దాంతో తనని కొట్టడానికి చక్రి ఛైర్ పట్టుకుంటాడు. తరువాయి భాగంలో మహాకి కన్నా ఫోన్ చేసి నాకు జ్వరం వచ్చింది వదిన, నువ్వు రా వదిన అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.